ఎలక్షన్లు దగ్గరకు వచ్చాయి. న్యూస్ చానెల్స్ పెరిగిపోయాయి. పార్టీలు మారేవాళ్ళ విషయాలు, రోడ్ షొల లైవ్ కార్యక్రమాలు, టిక్కెట్ల కోసం గొడవ, సినిమా వాళ్ళ ప్రచారాలు ఇవన్నీ మన టివి ల వాళ్ళకు టన్నుల కొద్ది వార్తలు ఇస్తున్నాయి. ప్రతి టివిలో ఎదోఒక చర్చా కార్యక్రమము దానికి తోడు ప్రేక్షకుల నుంచి యస్ యం యస్ ల రిక్వెస్ట్ లు. ఇటీవల మా మిత్రుడు (ఒక ప్రముఖ న్యూస్ చానెల్ పనిచేస్తున్నాడు) దగ్గర ఒక భయంకరమైన నిజం తెలుసుకున్నాను. టివి ల వాళ్ళు నిర్వహించే యస్ యం యస్ ల పోల్సు చాల వరకు అబద్దమని అప్పుడే తెలిసింది. మసి పూసి మారేడు కాయ చేస్తారని అర్థం అయింది. మనం విషయంలో కి వెళ్ళపోయేముందు తెలుసుకోవాల్సినదేమిటంటే చాల న్యూస్ చానెల్స్ ఎదోఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తుంటాయి. ఇక అసలు విషయానికి వద్దాము. ఈ మద్య ఒక న్యూస్ చానెల్ వాళ్ళూ ఒక చర్చా కార్యక్రమము నిర్వహించారు.
రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం కన్నా బాగా పనిచేసిందా?
1) అవును
2) లేదు
3) తెలియదు
మీ సమాధానం మాకు పంపాల్సిన విధానం, పోల్సు అని టైపు చేసి స్పేసు ఇచ్చి <1 లేదా 2 లేదా 3> అని టైపు చేసి 57575 కి యస్ యం యస్ చేయండి. మీ ఓపినీయన్స్ సాయంత్రం 7 గంటలలోగా మాకు పంపించండి. సాయంత్రం 7 గంటలకి మన టివి యాంకర్ చర్చ మొదలు పెడుతూ చూపించిన గ్రాఫు ఇలా వుంది

ఇక మన యాంకర్ మాట్లాడుతూ.. “54 శాతం ప్రజలు రాజశెఖర రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం కన్నా బాగా చేసిందని చెపుతున్నారు. 38 శాతం ప్రజలు కాదని, మిగతా 8 శాతం తెలియదని చెపుతున్నారు. దీని గురుంచి మాట్లాడటానికి మన స్టూడియోకి దానం నాగేందర్ గారు, గాలి ముద్దుక్రిష్ణమ నాయుడు గారు వచ్చారు. మీ ఇద్దరికి స్వాగతం. “. ఇలా చర్చ మొదలు అవుతుంది. ఇక మన వాళ్ళ అర్థం లేని వాదోప వాదాలు, గొడవలు మామూలే.
ఇంతకి టివి వాళ్ళు దేనికి మసి పూసి మారేడు కాయ చేసారో తెలుసా.. మొత్తం వచ్చిన యస్ యం యస్ లు 13.
| సమాధానం | మొత్తం వచ్చిన యస్ యం యస్ లు | శాతం లెక్క |
| అవును | 7 | మొత్తం 13 వోట్లకి 7 అవును అని వచ్చాయి . అంటే 100 కి 54. |
| లేదు | 5 | మొత్తం 13 వోట్లకి 5 లేదు అని వచ్చాయి . అంటే 100 కి 38 |
| తెలియదు | 1 | మొత్తం 13 వోట్లకి 1 తెలియదు అని వచ్చింది. అంటే 100 కి 8 |
దీనిని బట్టి మనకు అర్థం అయింది ఏమిటంటే మొత్తం వచ్చిన వోట్లు చెప్పకుండా కేవలం శాతాలు చెపితే ఆ విశ్లేషణ వల్ల అసలు ఉపయోగం వుండదు. 7 యస్ యం యస్ లు వస్తే మన టివి యాంకర్ ఎంత చక్కగా 58 శాతం ప్రజలని చెప్పాడో చూడండి. ఇది లెక్క ప్రకారం కరక్టే కాని చెప్పే విధానమే మోసం. చాలా మన టివి ల వాళ్ళల్లో చాలామంది ఇలాగే చేస్తున్నారు. లేకపోతే వాళ్ళకు అనుకాలంగా గ్రాఫులు మారుస్తున్నారు. అసలు వాళ్ళకు ఎన్ని యస్ యం యస్ లు వచ్చాయో ఎవరికి చెప్పరు. ఈ విషయం కేవలం ఆ గ్రాఫు తయారు చేసేవాడికే తెలుస్తుంది.
ముందుగా తయారు చేసుకున్న అంకెలు .
మాజిక్ లాజిక్ రెండూ కలిస్తే అంతకన్నా కావలసినది యేముంది
వ్యాఖ్య ద్వారా శేషశాయి ఒంగోలు,భాగ్యనగరం — ఫిబ్రవరి 16, 2009 @ 1:52 పూర్వాహ్నం
పదమూడా!!! హా.. హా… హా! ప్రేక్షకులు వీళ్ళ వేషాల్ని పట్టించుకోడం లేదని అర్థమై, చాలా సంతోషంగా ఉంది
ఈ పోల్సు ఎంత డొల్లో ఇప్పుడు తెలుస్తోంది.. వీటి లెక్కలు ఇంత అధ్వాన్నంగా ఉంటాయని అనుకోలేదు.
టీవీ చానెలోళ్ళకి నాదో ఉచిత సలహా.. ఎస్సెమ్మెస్సులు ఇబ్బడి ముబ్బడిగా తెప్పించుకునే సలహా..
ఔను, కాదు, తెలీదు లతో పాటు మరో సమాధానం కూడా చేర్చుకోవాలి – “ఇహ కట్టిపెట్టరా ఈ ఎదవేసాలు”.
వ్యాఖ్య ద్వారా చదువరి — ఫిబ్రవరి 16, 2009 @ 2:49 పూర్వాహ్నం