గుడ్ ఈవినింగ్ .. వెల్కం టు 10 మినిట్స్. ఈ రోజు మనము చూడబోయే అంశం “వురఫ్ ఊసరవెల్లి”. మన రాజకీయ నాయకులు ఎంత సులువుగా మాటమారుస్తారో, ఎంత సులువుగా కూటములు కడతారో చూద్దాము. ఇక్కడ మనము గుర్తువుంచుకోవాల్సిన విషమేమిటంటే, ఇక్కడ మనము మాట్లాడుకోబోయే అందరూ బాగా చదువుకున్నవారే. అన్ని పార్టీల నాయకులు తమ సొంత ప్రయోజనాలకోసమే కూటములు కడతారనేది మనకు అర్దం అవుతుంది. చంద్రబాబుని ప్రపంచబ్యాంక్ జీతగాడని కోడై కూసి, తమ పత్రిక ప్రజాశక్తిలో ఎన్నో సంపాదకీయాల్లో చంద్రబాబు దుష్ట పాలన గురుంచి మాట్లాడి ఇవ్వాళ ఆయనతోనే జట్టు కట్టారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన రాఘవులు గారు. అప్పుడు టిడిపికి బొంద పెట్టమని ఇప్పుడు కాంగ్రెస్ కు బొంద పెడతాము అంటున్నారు కెసిర్ గారు. ఏమిటొ చంద్రబాబు గారు గత 5 సంత్సరాల్లో ఎంత మారిపోయారో తెలియదుకాని, మహా కూటమిలోని నాయకులు మాత్రం బాబు గారి ఇంటికి వెళ్ళడం చేతులు పైకెత్తడం. అందరూ ఊసరవెల్లికి అసలు అర్థం చెప్పకనే చెపుతున్నారు.
రాజకీయ నాయకులు ఇలా మాటలు మారుస్తున్నా మీడియాలో ఎవరూ దీనిని ప్రస్తావించరు. ఎవరు దీని గురుంచి మాట్లాడరు. నిజంగా ఈరాష్ట్రాన్ని బాగు చేయడానికే బాబు కూటమి కట్టారా అనేది ఎవరు ఆలోచించరు. మనమంతా చదువుకున్న వాళ్ళమే, అయినా మనము ఈ విషయం గురుంచి మాట్లాడుకోము. ఎన్నికలు దగ్గరకు వచ్చాయి, ఎందరో దొంగలు మరలా పోటీ చేస్తారు. ఇందిరమ్మ పధకంలో అవినీతి, నీటి పారుదల ప్రాజెక్ట్ లలో డబ్బులు బొక్కారు. హైటెక్ సిటి దగ్గర తెలుగుదేశం నాయకులకు ఎన్ని ఎకరాలు వున్నయో అందరికి తెలుసు. ప్రజారాజ్యంలో చేరిన ప్రతి ఒక్కరికి సొంత ప్లాను వుందని మనకు తెలుసు. మనమందరం ఈ రాజకీయాలని ఒకేసారి మార్చలేకపోవచ్చు. మనము రోజూ పేపర్లు చదువుతాము, టివిలు చూస్తాము. మనకి కనీసం అర్థం అవుతుంది, ఎవరు అవకాశవాదో, ఎవరు అసలు రాజకీయనాయకుడొ.. అదే విషయాన్ని కనీసం కొంతమందితోనైనా మాట్లాడుదాము. అందరికి రాజకీయలంటే చీదరే.. కాని ఇంకా ఎన్ని రోజులు ఇలా.. ఎందుకు మనము చదువుకున్నది.. మైకు పట్టుకుని మాట్లాడనవసరం లేదు.. మీ చుట్టాలతో లేక మీ స్నెహితులతో రాజకీయాలు మాట్లాడండి లేక మీకు అనిపించింది బ్లాగు వ్రాయండి.
2004 ఎన్నికలప్పుడు కొంతమంది నాయకుల మాటలు, ఇప్పుడు అంటున్న మాటలు కొన్ని..
| 2004 ఎన్నికలు | ప్రస్తుతం | |
![]() |
చంద్రబాబు ప్రపంచ బ్యాంక్ జీతగాడు. మన రాష్ట్రాన్ని అమెరికా కు తాకట్టు పెట్టాడు. మతతత్వ శక్తులతో చేతులు కలిపి ఈ దేశాన్ని నాశనం చేస్తున్నాడు. కరెంటు చార్జీలు తగ్గించమంటె నలుగురు ప్రాణాలు బలిగొన్నాడు. తెలుగుదేశాన్ని తరిమికొట్టండి. పెట్టుబడి దారుల కొమ్ము కాస్తున్న ఈ పాలన ఇంక ఎంతో కాలం కొనసాగదు. చంద్రబాబుని గద్దె దించడానికే మా పార్టి కాంగ్రెస్ తో ఎన్నికల అవగాహన కుదుర్చుకుంది. మా పార్టి సిద్దాంతాలకు అనుగుణంగా మేము నడుచుకుంటాము. మా జాతీయ నాయకత్వము తీసుకున్న నిర్ణయాలకు అణుగుణంగా మేము కాంగ్రెస్ పార్టితో కలిసి పనిచేస్తున్నాము. | కాంగ్రెస్ దుష్టపాలన అంతంచేయడమే మా మహాకూటమి లక్ష్యం. ఎక్కడచూసినా అవినీతి, ధరల పెరుగుదల, ఇందిరమ్మలో అవినీతి, ఒక్క సెంటు భూమి కూడా అసలైన పేదవారికి ఇవ్వలేదు. చంద్రబాబు ఇప్పుడు మారారు. మతతత్వశక్తులకు దూరంగా వున్నారు. మా జాతీయస్థాయిలో పొత్తులను బట్టి ఇక్కడా మేము అదే వైఖరిని పాటిస్తాము. |
![]() |
మాకు సోనియాగాంది మీద పూర్తి నమ్మకం వుంది. తెలంగాణ వెనుకుబాటుతనం గురుంచి మేడం సొనియాగాంది గారికి పూర్తిగా వివరించాము. కాంగ్రెస్ అధిష్టానం మీద వంద శాతం నమ్మకం వుంది. అందుకే మా పార్టి ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టితో పొత్తుకుదుర్చుకున్నది. తెలంగాణ గత 5 సంత్సరాలలో పూర్తిగా వెనుకబడింది. ఈ తెలుగుదేశం ప్రభుత్వం తెలంగాణా ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించింది. తెలంగాణ నుంచి చంద్రబాబుని తరిమికొట్టండి. తెలంగాణ ఆకలి దెబ్బకి చంద్రబాబు దిమ్మతిరగాలి. | తెలంగాణకి ఏకైక అడ్డం కాంగ్రెస్ పార్టి. తెలంగాణ ప్రజలని ఈ రాజశేఖరరెడ్డి మోసం చేసారు. కబడ్దార్ కాంగ్రెస్..ఇక మీ ఆటలు సాగవు. గత 5 సంత్సరాలుగా తెలంగాణలో కొత్తగా ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఈ సారి మా తడాఖ చూపిస్తాము. తెలంగాణలొ కాంగ్రెస్ పార్టికి బొంద పెడతాము. తెలంగాణలో మళ్ళా ఒక్క కాంగ్రెస్ నాయకుడుకూడా తిరగలేడు. కాంగ్రెస్ సీనియర్లు అంతా దద్దమ్మలు, ఎందుకు పనికిరాని వాళ్ళు. తెలుగుదేశంతో మేము పని చేయడానికి తెలంగాణ మేధావులు, కళాకారులు మరియు ప్రజా సంఘాల వాళ్ళ మద్దతు కూడా వుంది. |
![]() |
మా నినాదం సమైక్యాంద్ర. నేను చంద్రశేఖరరావు గారికి అప్పుడు మంత్రి పదవి ఇచ్చివుంటే ఇప్పుడు ఇలా వుండేదికాదు. ఆయనకి చిత్తశుద్దివుంటే ఎప్పుడొ బయటకు వెళ్ళేవారు. మా పాలనలో తెలంగాణ అభివ్రుద్ది ఆంద్ర ప్రాంతంతో సరిసమానంగా జరిగింది. ఇవ్వాళ ఎవరో కొంతమంది తమ స్వప్రయోజనాలకోసం తెలంగాణ అని గోలచేస్తున్నారు. వామపక్షాలకి ఒక సిద్దాంతంలేదు. వారికి వున్న రెండు శాతం వోట్లు మమ్ముల్ని ఏమిచేయలేవు. అయినా బిజెపి ని మతతత్వ పార్టి అనడం ఏంతవరకు సబబు. వాజపేయి గారి నాయకత్వంలో ఈదేశం ఎంతో అభివ్రుద్ది సాదించింది. | కాంగ్రెస్ అరాచకాలకు తగిన బుద్ది చెపుతాము. తెలంగాణ సాధించడం మహా కూటమికే సాధ్యం. వామపక్షాలు, టిరెస్, మేము కలవడంతో కాంగ్రెస్ కు వణుకు పుడుతుంది. మేము కచ్చితంగా 200కు పైగా సీట్లు సాధిస్తాము. చిరంజీవి అసలు మాకు పోటీ కాదు. మేము జతీయ స్థాయిలో కూడా వామపక్షాలకు మద్దతుఇస్తాము. |
![]() |
కేంద్రంలో వాజపేయి ప్రభుత్వము, రాష్ట్రంలో చంద్రబాబు చేసిన అభివ్రుద్ది మమ్ముల్ని ఈ ఎన్నికల్లో గెలిపిస్తాయి. ఇవ్వళ మన రాష్ట్రంలో ఐటి ఇంతగా అభివ్రుద్ది అయిందంటే దానికి కారణం చంద్రబాబే. గత 5 సంత్సరాల్లో జరిగిన అభివ్రుద్ది ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు. బిజెపి, తెలుగుదేశం మరలా ప్రభుత్వాలు కచ్చితంగా ఏర్పాటు చేస్తాయి. | చంద్రబాబు వలనే మేము తెలంగాణ ఇవ్వలేకపోయాము. వాజపేయి ప్రధానిగా వున్నపుడు మేము ఎన్నొసార్లు తెలంగాణ ప్రస్తావన చేసిన చంద్రబాబు అడ్డుపడ్డారు. తెలంగాణ కేవలం జాతీయ పార్టీలకే సాధ్యం. మేము ఈసారి పదవికి వచ్చిన 100 రోజుల్లొ తెలంగాణ ఇస్తాము. చంద్రబాబు పెద్ద దొంగ..అవకాశవాది. ఈసారి మేము ఒంటరిగానైనా పోటి చేయడానికి సిద్దంగా వున్నాము. |
![]() |
టిరెస్ మాతో కలవడం ఎంతో సంతోషదాయకం. ఇక తెలంగాణ సాధించడం ఎంతో దూరం లేదు. తెలంగాణకి ప్రధమ శత్రువు చంద్రబాబేనని కెసిర్ తెలుసుకోవడం అభినందనీయం. సోనియా గాంధిగారు కూడ తెలంగాణకి అనుకూలంగానే వున్నారు. మేము ఈ సారి ఎన్నికల్లో పూర్తి మెజారిటి సాధిస్తాము. తెలుగుదేశానికి డిపాజిట్లుకూడా దక్కవు. వామపక్షాలు మాతో కలవడం మాకు మరింత బలం. మేము వామపక్షాలు కలిసి కరెంట్ ఉద్యమము చేసాము. | టిరెస్ వలనే తెలంగాణ ఆలస్యం అయింది. వాళ్ళకి ఒక పద్దతి లేదు, తెలంగాణ వాళ్ళ సొంత సొత్తు అనుకుంటున్నారు. రాఘవులు గారికి సీట్లే ముఖ్యము. వామపక్షాలకి వున్న రెండు శాతం వోట్లు మమ్ముల్ని ఏమిచేయలేవు. వాళ్ళది పిచ్చికూటమి. మా ప్రభుత్వము చేసిన అభివ్రుద్ది మమ్ముల్ని గెలిపిస్తుంది. మాకు ఏకూటములు అవసరంలేదు. |





వ్యాఖ్య ద్వారా చైతన్య — ఫిబ్రవరి 2, 2009 @ 3:58 పూర్వాహ్నం
nice review
వ్యాఖ్య ద్వారా శివ బండారు — ఫిబ్రవరి 2, 2009 @ 5:40 పూర్వాహ్నం