మెరుగైన రాజకీయం కోసం

జనవరి 15, 2009

గోడ మీద పిల్లి ఆఫ్ ది ఇయర్ 2008

Filed under: టివి91 విశ్లెషణ — murahari @ 4:18 పూర్వాహ్నం

గుడ్ ఈవినింగ్, మీరు చూస్తున్నది టివి91, నా పేరు రాజు. ముందుగా మీ అందరికి 2008 గుర్తులు కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమములో ముందుగా మనము చూడబోయే అంశంగోడమీద పిల్లి ఆఫ్ ది ఇయర్ 2008′. ఇక ఆలస్యం చేయకుండా కార్యక్రమము మొదలు పెడదామా

 

నేను చిరంజీవి గారు రాజకీయాల్లోకి రావాలని పాదయాత్ర చేస్తే నాకు కనీసం గౌరవం కూడా ఇవ్వలేదు, అందుకే నేను వేరే పార్టిలో చేరదాము అనుకుంటున్నాను. అసలు చిరంజీవి వల్ల సామాజిక న్యాయం సాధ్యపడదుఅని ఈమద్య ఒక రిటైర్డ్ ఐఏస్ అధికారి రొశయ్య అన్న మాటలివి. “కాంగ్రెస్ పార్టి ఆఫీసులో ఎక్కడ చూసినా కిళ్ళీలు వుమ్మి, ఏమూల చూసినా దుమ్ము కనిపిస్తాయి. అదే తెలుగుదేశం ఆఫిసులో చాలా శుబ్రంగా వుంటుంది. మొన్న రైలు ప్రమాదం జరిగినప్పుడు నేను నారాయణ కాలేజి డైరెక్టర్, ఏసి బోగిలో వున్నాము. నేను ప్రమాదం జరిగిన వెంటనే నారాయణ డైరెక్టర్ నుంచి సెల్ ఫోను తీసుకోని రాజశేఖరరెడ్డి గారికి ఫోను చేసి చెపితే ఆయన, అవునా అంటూ ఫోను పెట్టేసారు. అదే ముఖ్యమంత్రి చంద్రబాబుకు చేస్తే వెంటనే స్పందించారు“, మాటలు నన్నపనేని రాజకుమారి గారు తెలుగుదేశంలో చేరేటప్పుడు ఇచ్చిన వివరణ. పచ్చి కాంగ్రెస్ వ్యతిరేకి, తన వాక్చాతుర్యంతో కాంగ్రెస్ విధానాలను ఎండకట్టీన బహుముఖ ప్రఘ్నాశాలి జైపాల్ రెడ్డీ గారు కాంగ్రెస్ లో చేరుతూఇప్పుడు కాంగ్రెస్ అవసరం ఎంతైనా వుందిఅంటూ కాంగ్రెస్ లో చేరారు. ఇలా చెప్పుకుంటూపోతే ఒక పెద్ద పుస్తకం నిడిపోతుంది. ఒక రైలు దిగి ఇంకో రైలు ఎక్కినట్లు రాజకీయ నాయకులు ఒక పార్టి నుంచి మరొక పార్టికి మారుతున్నారు. 2004 అసెంబ్లి ఎన్నికలప్పుడు దానం నాగేందర్ గోడమీద పిల్లికి అసలైన అర్థం ఏమిటొ మనకు చూపారు. ఆసిఫ్ నగర్ అసెంబ్లి టికెట్ ఇవ్వలేదని ఒక్క అంగలో తెలుగుదేశంలో చేరారు. బాగా చదువుకున్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమి ఆలోచించకుండా నాగేందర్ కు టికెట్ ఇచ్చారు. నాగేందర్ ఎన్నికల్లో గెలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. తరువాత మరలా మన నాగేందర్ గారు కాంగ్రెస్ లో చేరడము, రాజీనామా చేయడమూ, మరలా ఎలక్షన్లు అన్ని మామూలే. ఇవ్వాళ మరలా గ్రేటర్ హైదరాబాదు అద్యక్షునిగా నాగేందర్ ని చదువుకున్న డి శ్రీనివాస్ గారు నియమించారు. ఇవన్ని చూస్తుంటే అందరూ పార్టిలు మారేది తమ స్వప్రయోజనాలకే  అని తెలుస్తుంది. ఇదిఏమి కొత్త విషయమేమి కాదు. కాని ఇన్ని జరుగుతున్నా జనంలో ఒక్కరైనా వాళ్ళని అడిగిన వాళ్ళులేరు. అంతా చదువుకున్న వాళ్ళమే, కాని మనమెవరము పార్టిలు మారే వాళ్ళని ప్రశ్నించము. వరదనీరులాగా ప్రజా రాజ్యంలోకి గోడమీద పిల్లులు చేరుతుంటే , దాని గురించి ఆలోచించడానికి చిరంజీవి గారికి సమయము దొరకడంలేదు. క్యాడర్ పెరుగుతుంది అని ఆలోచిస్తూ అందరికి ప్రజారాజ్యం కండువా వేస్తున్నారు. కాని వీళ్ళంతా సిద్దాంతాలను పాటించకుండా, తమ సొంత ప్రయోజనాలకోసమో, వేరే పార్టిలో వారికి గౌరవం దక్కడంలేదనో ప్రజా రాజ్యంలో చేరుతున్నారని చిరంజీవిగారు ఆలోచించాలి. ఆదికేశవులునాయుడు గారు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలో చేరి, మరలా కాంగ్రెస్ కి సపోర్ట్ ఇచ్చి ఇవ్వాళ  టిటిడి చైర్మన్ గా వున్నారు. తెలుగుదేశం తరుపున రాజ్యసభకి ఎన్నికై, రామారావు గారు చనిపోయినతరువాత లక్ష్మి పార్వతికి సపొర్ట్ ఇచ్చి, తరువాత బిజెపి తరుపున ప్రచారం చేసి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు చుట్టం అయ్యారు  విలక్షన మోహనబాబు గారు. సూపర్ స్టార్ క్రిష్ణ గారు ఎందుకు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి మారారో, మరలా ఇప్పుడు కాంగ్రెస్ లోకి ఎందుకు మారారో ఎవరికి తెలియదు.

                                ఇక్కడ మనము గమనించాల్సిన విషయమేమిటంటే పార్టిలు తమ సిద్దంతాలని ఏమి మార్చడంలేదు, కాని గోడమీద పిల్లులకు వారి అవసరాలే ముఖ్యం. ఇక అసలు విషయానికి వద్దాము. మన అసెంబ్లికి 2009లో ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఇక గోడమీద పిల్లులు తమ ప్రతాపం చూపిస్తాయి. 2008 సంవత్సరంలో చాలా మంది పార్టిలు మారారు. వీళ్ళందరిలోగోడమీద పిల్లి ఆఫ్ ది ఇయర్ 2008″ సెలెక్ట్ చెయ్యడం కోసం టివి9 కాంటెస్ట్ పెట్టింది. అయితే ఇందులో కొంతమందిని మాత్రమే పరిగణించవలసి వచ్చింది. బాగా పేరున్న నాయకులు, పదవులు అనుభవించి వేరే పార్టిలో చేరిన వాళ్ళూ, పార్టి మారడంతోనే పదవి వచ్చిన వాళ్ళనే కాంటెస్ట్ లోకి తీసుకోవడం జరిగింది. ఇందులో పార్టి నుంచి బయటకు వెళ్ళీ సొంత పార్టి పెట్టుకున్న వాళ్ళని పరిగణలోకి తీసుకోలేదు. కాంటెస్ట్ కు ఎంపిక అయినవాళ్ళు 

 

పేరు

పార్టి నుంచి?

పార్టి లోకి?

హరిరామ జోగయ్య

కాంగ్రెస్

ప్రజారాజ్యం

ఉపేంద్ర

కాంగ్రెస్

ప్రజారాజ్యం

శివశంకర్

కాంగ్రెస్

ప్రజారాజ్యం

వంగవీటి రాధ

కాంగ్రెస్

ప్రజారాజ్యం

పులిమి శైలజ

కాంగ్రెస్

ప్రజారాజ్యం

బషీరుద్దీన్ బాబూఖాన్

కాంగ్రెస్

ప్రజారాజ్యం

కోటగిరి విధ్యాధరరావు

తెలుగుదేశం

ప్రజారాజ్యం

తమ్మినేని సీతారాం

తెలుగుదేశం

ప్రజారాజ్యం

భూమా నాగిరెడ్డి

తెలుగుదేశం

ప్రజారాజ్యం

శొభానాగిరెడ్డి

తెలుగుదేశం

ప్రజారాజ్యం

సి రామచంద్రయ్య

తెలుగుదేశం

ప్రజారాజ్యం

పాలేటి రామారావు

తెలుగుదేశం

ప్రజారాజ్యం

ఘంటా శ్రీనివాసరావు

తెలుగుదేశం

ప్రజారాజ్యం

యలమంచిలి రవి

తెలుగుదేశం

ప్రజారాజ్యం

జి గనబాబు

తెలుగుదేశం

ప్రజారాజ్యం

ఖలీల్ భాష

తెలుగుదేశం

ప్రజారాజ్యం

పరకాల ప్రభాకర్

బిజెపి

ప్రజారాజ్యం

గాలి ముద్దుక్రిష్ణమనాయుడు

కాంగ్రెస్

తెలుగుదేశం

పి దొరబాబు

బిజెపి

కాంగ్రెస్

సంతొష్ రెడ్డి

టి.అర్.ఎస్

కాంగ్రెస్

కె లింగయ్య

టి.అర్.ఎస్

కాంగ్రెస్

జి ముకుంద రెడ్డి

టి.అర్.ఎస్

కాంగ్రెస్

బి సార రాణి

టి.అర్.ఎస్

కాంగ్రెస్

ఆదికేశవులునాయుడు

కాంగ్రెస్

తెలుగుదేశం

పెద్ది రెడ్డి

తెలుగుదేశం

.తె.పా

క్రిష్ణ (సూపర్ స్టార్ )

తెలుగుదేశం

కాంగ్రెస్

జూపూడి ప్రభాకర్

కాంగ్రెస్

ప్రజారాజ్యం

యలమంచిలి శివాజి

తెలుగుదేశం

ప్రజారాజ్యం

 

 

పార్టిలోకి ఎక్కువ దూకారు?

 untitled2

 చూశారుగా పోటి ఎంత ఎక్కువగా వుందో, వీళ్ళందరిలోగోడమీద పిల్లి ఆఫ్ ది ఇయర్ 2008″ ని సెలెక్ట్ చెయ్యడం కోసం టివి91 పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. కంటెస్ట్ విన్నర్ ఎవరో తెసుకునే ముందు ఒక చిన్న బ్రేకు. చూస్తూనే వుండండి నిరంతర వార్తావాహిని టివి91.

 

వెల్కం బ్యాక్. ఇక పొటిలో ఫైనల్ కి చేరిని ముగ్గురు ఎవరంటే.. గుట్టుచప్పుడు కాకుండా డిల్లీలో మన్మోహన్ సర్కారికి ఓటు వేసి, వెంటనే టిటిడి పదవికొట్టిన ఆదికేశవులునాయుడు, తన స్టూడియో భూములకోసం తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన సూపర్ స్టార్ క్రిష్ణ, తనతో పాటు తన భార్యని కూడా తెలుగుదేశం నుంచి ప్రజా రాజ్యంలోకి తెచ్చిన భూమా నాగిరెడ్డీ                                        

 Images

 

ఇక విన్నర్ ఎవరంటేతనదైన శైలిలో కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలో చేరి, లోక్ సభ సభ్యునిగా 4 సంత్సరాలు పనిచేసి, ప్రధాన మంత్రికి ఆపత్భాందవుడై, ఏడుకొండలవాడి సన్నిదిలో పదవి చేపట్టీ గోడమీద పిల్లికి అసలైన అర్థం చెప్పిన ఆదికేశవులునాయుడు గారు


టివి91 విశ్లేషణ :

2008లో బాగ నష్టపోయిన పార్టి: ప్రజారాజ్యం (ఎక్కువగా పార్టిలోకి దూకారు. మరలా దూకటానికి అనుభవం మెండుగా వుంది)

 2008లో బాగ లాభపడ్డ  పార్టి: తెలుగుదేశం (దూకాల్సిన వాళ్ళూ దూకారు. ఇంకా దూకుతున్నారు. చంద్రబాబు ఇప్పుడు పార్టిని బలోపేతం చేసుకోవడానికి అవకాశం వుంది)

 

2008లో బాగా బిస్కెట్లు వేసిన పార్టి: కాంగ్రెస్ (ఆదికేశవులునాయుడు, క్రిష్ణ, మందా జగన్నాథం లాంటి వారికి కాంగ్రెస్ లోకి రావడం వలన పదవులు లేక ఆస్తులు వరించాయి)

 

ముగింపు: పార్టిలు ఎక్కువ అయిపోయాయి, అవకాశాలు పెరిగాయి, పార్టి మారడమంటే కండువా మార్చడమే. పార్టి మారిన వాళ్ళని అడిగే వాళ్ళు ఎవరూ లేరు. చాలా సార్లు ఒక వ్యక్తి పార్టి మారడంవలన ప్రజల నెత్తిన ఆర్ధిక భారం పెరుగుతుంది. ఎవరి పనుల్లొ వాళ్ళు బిజి, ఎన్నికలరోజున ఓటు వేసేవాళ్ళు బాగా తగ్గిపోతున్నారు. కాని మనము ఓటు వేయకపోవడం వలన జరిగే నష్టం ఎవరూ ఆలోచించడంలేదు. అందరం చదువుకున్నాము, కాని ఎవరూ మాట్లాడరు. మీడియా కుడా పార్టిలు మారిన వాళ్ళగురుంచి ప్రచారం చేయరు. కొత్త సంవత్సరం అందరం ఒక ప్రతిఘ్న చేద్దాము. పార్టిలు మారేవాళ్ళ గురుంచి మాట్లాడుదాము, వాళ్ళకి జాగ్రత్తగా ఓటు వేద్దాము..

1 వ్యాఖ్య »

  1. మీ విశ్లేషణ బాగుంది. కొన్ని అచ్చుతప్పులు ఉన్నాయి.
    ఆదికేశవులునాయుడు కి మొదటి స్థానం ఇవ్వడం సబబే!!!

    వ్యాఖ్య ద్వారా సిరి — జనవరి 15, 2009 @ 4:54 పూర్వాహ్నం


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Theme: Rubric. WordPress.com లో Blog పెట్టుము.

Follow

Get every new post delivered to your Inbox.