
మార్చి 8, 2009
మార్చి 2, 2009
వస్తున్నాయి..వస్తున్నాయి..
వస్తున్నాయి..వస్తున్నాయి..
మాయదారి ఎన్నికలు మళ్ళా వస్తున్నాయి
మనకు నచ్చని ఎన్నికలు మనముందున్నాయి.
ఓట్ల కోసం కోట్లు గుమ్మరించే నాయకులు
సీట్ల కోసం తిట్లుతిట్టే చవటలు
అప్పుడప్పుడు కూడా కనబడని శుద్ద వెధవలు
మనముందుకొస్తున్నారు మంచిచేస్తామని.
ఎప్పుడు ఏ పార్టిలో వుంటారో తెలియదు
ఎవరితో పొత్తు అనేది చివరిదాకా చెప్పరు
నిన్నటిదాక తిట్టి, నేడు మంచివాడంటారు
ఈ గుంటనక్కలు..గోడమీద పిల్లులు.
ఈ రాజకీయాలని చూసి జనమంతా చీ..చీ అంటున్నారు
మనకెందుకులే అని మౌనంగా వుంటారు
అందుకే నేనసలు ఓటు వేయనని చెపుతారు
అందరూ చదువుకున్న వాళ్ళే..అయినాసరే ఎక్కడొ లోపం.
సినిమా బాగాలేదని ఫోను చేసి మరీ చెపుతాం
రౌడి రాజకీయనాయుకుడికి ఓటు వేయొద్దని అమ్మ నాన్నలకు కూడా చెప్పం
ఇంకేమి బాగుంటాయి రాజకీయాలు
ఎక్కడనుంచి వస్తారు మంచి నాయకులు.
ఎందుకు మనం చదువుకున్నది
మన తెలివంతా ఎటుపోతున్నది
ధర్నాలు అవసరం లేదు రాస్తారోకోలు అసలే వద్దు
మీకు నచ్చిన నాయకుడి గురుంచి మాట్లాడండి.
ఇక ఆలస్యం చేస్తే 5 సంత్సరాలు అనుభవించాలి
మాట్లాడుదాం, మనకు నచ్చిన విషయం చెపుదాం
అది బ్లాగైనా, లెటరైనా మనకు తెలిసింది రాద్దాం
ఏ నాయకుడికి ఓటు వేయొద్దో, ఎవరికి ఓటు వెయ్యాలో చెపుదాం.
ఓటు ఒక వజ్రాయుధమని నిరూపిద్దాం
దేశాన్ని ముందుకు నడిపేవాడే నాయకుడని ఎలుగెత్తి చాటుదాం…
మన రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు – 2004 లో ఎవరితో పొత్తు – ప్రస్తుతం ఎవరితో
|
పార్టి పేరు |
ప్రస్తుత అధ్యక్షులు |
పార్టి గుర్తు |
2004 ఎన్నికలు |
2009 ఎన్నికలు |
|
కాంగ్రెస్ |
డి. శ్రీనివాస్ |
|
టి ఆర్ స్, సి పి యం, సి పి ఐ,యం ఐ యం తొ పొత్తు |
యం ఐ యం తొ పొత్తు |
|
తెలుగుదేశం |
చంద్రబాబు నాయుడు |
|
బి జె పి తొ పొత్తు |
టి ఆర్ స్, సి పి యం, సి పి ఐ తొ పొత్తు |
|
బిజెపి |
బండారు దత్తాత్రేయ |
|
తెలుగుదేశం తో పొత్తు |
ఎవరితోనూ పొత్తు కుదరలేదు |
|
టి.అర్.ఎస్ |
కె. చంద్రశేఖరరావు |
|
కాంగ్రెస్ తో పొత్తు |
తెలుగుదేశం, సి పి యం, సి పి ఐ తో పొత్తు |
|
ప్రజారాజ్యం |
చిరంజీవి |
|
పార్టి ఆవిర్భవించలేదు |
|
|
సి.పి.యం |
రాఘవులు |
|
కాంగ్రెస్ తో పొత్తు |
తెలుగుదేశం తో పొత్తు |
|
సి.పి.ఐ |
నారాయణ |
|
కాంగ్రెస్ తో పొత్తు |
తెలుగుదేశం తో పొత్తు |
|
లోక్ సత్తా |
జయప్రకాష్ నారాయణ |
|
పార్టి ఆవిర్భవించలేదు
|
ఒంటరిగా పోటి |
|
ప్రజాశాంతి పార్టి |
కె.యె.పాల్ |
|
పార్టి ఆవిర్భవించలేదు
|
ఇంకా ఎవరితోనూ పొత్తు లేదు |
|
మన పార్టి |
కాసాని జ్ఞానేశ్వర్ |
|
పార్టి ఆవిర్భవించలేదు
|
ఇంకా ఎవరితోనూ పొత్తు లేదు |
|
రాజ్యాధికార పార్టి |
నారగోని |
|
పార్టి ఆవిర్భవించలేదు
|
ఇంకా ఎవరితోనూ పొత్తు లేదు |
|
బి.యస్.పి |
కత్తి ధనరాజ్ |
|
ఒంటరిగా పోటి |
ఇంకా ఎవరితోనూ పొత్తు లేదు |
|
యస్.పి |
జయప్రద |
|
ఒంటరిగా పోటి |
ఇంకా ఎవరితోనూ పొత్తు లేదు |
|
సి.పి.ఐ (యం యల్) |
గోవర్ధన్ |
|
ఒంటరిగా పోటి |
ఒంటరిగా పోటి |
|
యం.ఐ.యం |
అసాదుద్దిన్ ఓవైసి |
|
ఒంటరిగా పోటి |
కాంగ్రెస్ తో పొత్తు |
|
యం.బి.టి |
|
|
|
ఇంకా ఎవరితోనూ పొత్తు లేదు |
|
|
|
|
ఒంటరిగా పోటి |
|
ఫిబ్రవరి 15, 2009
మసి పూస్తే మారేడు..
ఎలక్షన్లు దగ్గరకు వచ్చాయి. న్యూస్ చానెల్స్ పెరిగిపోయాయి. పార్టీలు మారేవాళ్ళ విషయాలు, రోడ్ షొల లైవ్ కార్యక్రమాలు, టిక్కెట్ల కోసం గొడవ, సినిమా వాళ్ళ ప్రచారాలు ఇవన్నీ మన టివి ల వాళ్ళకు టన్నుల కొద్ది వార్తలు ఇస్తున్నాయి. ప్రతి టివిలో ఎదోఒక చర్చా కార్యక్రమము దానికి తోడు ప్రేక్షకుల నుంచి యస్ యం యస్ ల రిక్వెస్ట్ లు. ఇటీవల మా మిత్రుడు (ఒక ప్రముఖ న్యూస్ చానెల్ పనిచేస్తున్నాడు) దగ్గర ఒక భయంకరమైన నిజం తెలుసుకున్నాను. టివి ల వాళ్ళు నిర్వహించే యస్ యం యస్ ల పోల్సు చాల వరకు అబద్దమని అప్పుడే తెలిసింది. మసి పూసి మారేడు కాయ చేస్తారని అర్థం అయింది. మనం విషయంలో కి వెళ్ళపోయేముందు తెలుసుకోవాల్సినదేమిటంటే చాల న్యూస్ చానెల్స్ ఎదోఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తుంటాయి. ఇక అసలు విషయానికి వద్దాము. ఈ మద్య ఒక న్యూస్ చానెల్ వాళ్ళూ ఒక చర్చా కార్యక్రమము నిర్వహించారు.
రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం కన్నా బాగా పనిచేసిందా?
1) అవును
2) లేదు
3) తెలియదు
మీ సమాధానం మాకు పంపాల్సిన విధానం, పోల్సు అని టైపు చేసి స్పేసు ఇచ్చి <1 లేదా 2 లేదా 3> అని టైపు చేసి 57575 కి యస్ యం యస్ చేయండి. మీ ఓపినీయన్స్ సాయంత్రం 7 గంటలలోగా మాకు పంపించండి. సాయంత్రం 7 గంటలకి మన టివి యాంకర్ చర్చ మొదలు పెడుతూ చూపించిన గ్రాఫు ఇలా వుంది

ఇక మన యాంకర్ మాట్లాడుతూ.. “54 శాతం ప్రజలు రాజశెఖర రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం కన్నా బాగా చేసిందని చెపుతున్నారు. 38 శాతం ప్రజలు కాదని, మిగతా 8 శాతం తెలియదని చెపుతున్నారు. దీని గురుంచి మాట్లాడటానికి మన స్టూడియోకి దానం నాగేందర్ గారు, గాలి ముద్దుక్రిష్ణమ నాయుడు గారు వచ్చారు. మీ ఇద్దరికి స్వాగతం. “. ఇలా చర్చ మొదలు అవుతుంది. ఇక మన వాళ్ళ అర్థం లేని వాదోప వాదాలు, గొడవలు మామూలే.
ఇంతకి టివి వాళ్ళు దేనికి మసి పూసి మారేడు కాయ చేసారో తెలుసా.. మొత్తం వచ్చిన యస్ యం యస్ లు 13.
| సమాధానం | మొత్తం వచ్చిన యస్ యం యస్ లు | శాతం లెక్క |
| అవును | 7 | మొత్తం 13 వోట్లకి 7 అవును అని వచ్చాయి . అంటే 100 కి 54. |
| లేదు | 5 | మొత్తం 13 వోట్లకి 5 లేదు అని వచ్చాయి . అంటే 100 కి 38 |
| తెలియదు | 1 | మొత్తం 13 వోట్లకి 1 తెలియదు అని వచ్చింది. అంటే 100 కి 8 |
దీనిని బట్టి మనకు అర్థం అయింది ఏమిటంటే మొత్తం వచ్చిన వోట్లు చెప్పకుండా కేవలం శాతాలు చెపితే ఆ విశ్లేషణ వల్ల అసలు ఉపయోగం వుండదు. 7 యస్ యం యస్ లు వస్తే మన టివి యాంకర్ ఎంత చక్కగా 58 శాతం ప్రజలని చెప్పాడో చూడండి. ఇది లెక్క ప్రకారం కరక్టే కాని చెప్పే విధానమే మోసం. చాలా మన టివి ల వాళ్ళల్లో చాలామంది ఇలాగే చేస్తున్నారు. లేకపోతే వాళ్ళకు అనుకాలంగా గ్రాఫులు మారుస్తున్నారు. అసలు వాళ్ళకు ఎన్ని యస్ యం యస్ లు వచ్చాయో ఎవరికి చెప్పరు. ఈ విషయం కేవలం ఆ గ్రాఫు తయారు చేసేవాడికే తెలుస్తుంది.
ఫిబ్రవరి 7, 2009
ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా ……
ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా
నలుపు నలుపేగాని తెలుపు రాదు
కొయ్యబొమ్మని తెచ్చి కొట్టీనా తిట్టినా పలుకునా
విశ్వదాభిరామ వినురవేమ
2004 ఎన్నికల్లొ వామపక్షాలు టిరెస్ ఎందుకు కాంగ్రెస్ తో కలిసారో, ఇప్పుడు మరలా చంద్రబాబుతో ఎందుకు కలిసారో అందరికి తెలిసిన విషయమే. ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలి అంతే. సిద్దంతాలు లేవు..ఉద్యమాలు లేవు..2009 ఎన్నికల్లో కాంగ్రెస్ మరలా గెలిస్తే మహాకూటమి బద్దలు అవుతుంది. 9 సంవత్సరాలు చంద్రబాబు పదవిలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు నందమూరి హీరోలని కలిసారో మనకి తెలుసు. దీనిని బట్టి అర్థం అయేదేమిటంటే ..ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా..
| 2009 ఎన్నికల్లో ఇలాగ జరిగితే | సీట్ల సంఖ్య | పరిస్థితి ఇలా ఉంటుంది |
| టిడిపి | 70 | # చిరంజీవి ఇంటికి నారయణ, రాఘవులు పయనం. కాంగ్రెస్ ని అడ్డుకోవడానికి అందరూ కలిసిరావాలని ప్రకటన # మొదటి అసెంబ్లి సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని కెసిర్, దేవేందర్ గౌడ్ పట్టు # మౌనంగా ఉన్న చంద్రబాబు. కొత్త సినిమాలు ఒప్పుకున్న బాలక్రిష్ణ. తెలుగుదేశం అద్యక్షునిగా బాలక్రిష్ణ వుండాలని తారక రత్న గొడవ. # ఈనాడు మొదటి పేజీలో దిగాలుగా వున్న వైస్ పెద్ద ఫొటొ. సాక్షి పేపరు తమకు సరిగా బిల్లులు చెల్లించడలేదని పోలీసు కేసుపెట్టిన పంపిణిదారులు # ప్రజారాజ్యానికి ఉపేంద్ర, శివశంకర్ రాజీనామ. తదుపరి నిర్ణయం త్వరలో చెపుతామని ప్రకటన #కాకా ఇంట్లో భేటి అయిన కాంగ్రెస్ సీనియర్లు. తెలంగాణ ప్రకటన ఆలస్యం అయినందువలనే తక్కువ సీట్లు వచ్చాయని అధిష్టానికి లేఖ. |
| టిరెస్ | 20 | |
| వామపక్షాలు | 10 | |
| ప్రజారాజ్యం | 40 | |
| కాంగ్రెస్ | 110 | |
| నతెపా | 10 | |
| మజ్లిస్ | 10 | |
| బిజెపి | 5 | |
| ఇతరులు | 19 | |
| టిడిపి | 130 | # పాలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు. జూనియర్ యన్ టి ర్ కి దొరకని అపాయంట్ మెంటు.హరిక్రిష్ణకి మరలా రాజ్యసభ సీటు గల్లంతు. బాబాయ్ పవర్ ఏమిటొ ఈ ఎన్నికల ద్వారా ఋజువయిందని చెప్పిన తారకరత్న. # ప్రజా వ్యతిరేఖ ప్రభుత్వం ఓడిపోయిందని వామపక్షాల ప్రకటన. మరో నెలలో ఏదోఒక ఉద్యమం మొదలుపెడతామని ప్రకటన. # తెలంగాణకి కట్టుబడి వుండాలని కెసిర్ చంద్రబాబుకి ఫోను. దేవేందర్ గౌడ్ వలనే ఓట్లు చీలిపోయాయని ప్రకటన # కాంగ్రెస్ లోనే దొంగలున్నారన్న వైస్. డిస్ ని అద్యక్షునిగా తొలిగించాలని మేడంకి లేఖ. # ఈనాడు మొదటిపేజీలో చంద్రబాబు భారీ ఫొటొ. నష్టాల్లో సాక్షి పేపరు. # కాకా ఇంట్లో భేటి అయిన కాంగ్రెస్ సీనియర్లు. తెలంగాణ ప్రకటన ఆలస్యం అయినందువలనే తక్కువ సీట్లు వచ్చాయని అధిష్టానికి లేఖ. |
| టిరెస్ | 20 | |
| వామపక్షాలు | 5 | |
| ప్రజారాజ్యం | 30 | |
| కాంగ్రెస్ | 80 | |
| నతెపా | 5 | |
| మజ్లిస్ | 10 | |
| బిజెపి | 5 | |
| ఇతరులు | 9 | |
| టిడిపి | 40 | # తెలుగుదేశం అద్యక్షునిగా చంద్రబాబు రాజీనామ చేయాలని పురందేశ్వరి డిమాండ్. బాలక్రిష్ణ ఇంటికి తెలుగు నేతల క్యూ # చంద్రబాబు వలనే ఓట్లు తగ్గాయని కెసిర్ మండిపాటు. అమెరికా తిరుగు ప్రయాణం అయిన కెసిర్ కుమారుడు. # ప్రజారాజ్యంలో విలీనం అయిన నతెపా. బంజారాహిల్స్ లో వున్న నతెపా కార్యాలయం మూసివేత. # బెంగుళూర్లో జగన్ ఇంటికి కాంగ్రెస్ ఇంటికి నేతల క్యూ. చంద్రబాబు పిచ్చి మాటలు ప్రజలు నమ్మలేదని వైస్ ప్రకటన. # రామోజి ఫిల్మ్ సిటి మీద ఇంకంటాక్స్ అధికార్లు దాడి. బాంబే స్టాకు ఎక్సేంజ్ లో సాక్షి పేపరు నమోదు. # ధనబలం, గూండాయిజం గెలిచాయన్న వామపక్షాలు. ఈ ఫలితాలవలన ఉద్యమాలు ఆగవని ప్రకటన. |
| టిరెస్ | 20 | |
| వామపక్షాలు | 5 | |
| ప్రజారాజ్యం | 40 | |
| కాంగ్రెస్ | 150 | |
| నతెపా | 7 | |
| మజ్లిస్ | 10 | |
| బిజెపి | 5 | |
| ఇతరులు | 17 |
ఫిబ్రవరి 1, 2009
“వురఫ్ ఊసరవెల్లి”
గుడ్ ఈవినింగ్ .. వెల్కం టు 10 మినిట్స్. ఈ రోజు మనము చూడబోయే అంశం “వురఫ్ ఊసరవెల్లి”. మన రాజకీయ నాయకులు ఎంత సులువుగా మాటమారుస్తారో, ఎంత సులువుగా కూటములు కడతారో చూద్దాము. ఇక్కడ మనము గుర్తువుంచుకోవాల్సిన విషమేమిటంటే, ఇక్కడ మనము మాట్లాడుకోబోయే అందరూ బాగా చదువుకున్నవారే. అన్ని పార్టీల నాయకులు తమ సొంత ప్రయోజనాలకోసమే కూటములు కడతారనేది మనకు అర్దం అవుతుంది. చంద్రబాబుని ప్రపంచబ్యాంక్ జీతగాడని కోడై కూసి, తమ పత్రిక ప్రజాశక్తిలో ఎన్నో సంపాదకీయాల్లో చంద్రబాబు దుష్ట పాలన గురుంచి మాట్లాడి ఇవ్వాళ ఆయనతోనే జట్టు కట్టారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన రాఘవులు గారు. అప్పుడు టిడిపికి బొంద పెట్టమని ఇప్పుడు కాంగ్రెస్ కు బొంద పెడతాము అంటున్నారు కెసిర్ గారు. ఏమిటొ చంద్రబాబు గారు గత 5 సంత్సరాల్లో ఎంత మారిపోయారో తెలియదుకాని, మహా కూటమిలోని నాయకులు మాత్రం బాబు గారి ఇంటికి వెళ్ళడం చేతులు పైకెత్తడం. అందరూ ఊసరవెల్లికి అసలు అర్థం చెప్పకనే చెపుతున్నారు.
రాజకీయ నాయకులు ఇలా మాటలు మారుస్తున్నా మీడియాలో ఎవరూ దీనిని ప్రస్తావించరు. ఎవరు దీని గురుంచి మాట్లాడరు. నిజంగా ఈరాష్ట్రాన్ని బాగు చేయడానికే బాబు కూటమి కట్టారా అనేది ఎవరు ఆలోచించరు. మనమంతా చదువుకున్న వాళ్ళమే, అయినా మనము ఈ విషయం గురుంచి మాట్లాడుకోము. ఎన్నికలు దగ్గరకు వచ్చాయి, ఎందరో దొంగలు మరలా పోటీ చేస్తారు. ఇందిరమ్మ పధకంలో అవినీతి, నీటి పారుదల ప్రాజెక్ట్ లలో డబ్బులు బొక్కారు. హైటెక్ సిటి దగ్గర తెలుగుదేశం నాయకులకు ఎన్ని ఎకరాలు వున్నయో అందరికి తెలుసు. ప్రజారాజ్యంలో చేరిన ప్రతి ఒక్కరికి సొంత ప్లాను వుందని మనకు తెలుసు. మనమందరం ఈ రాజకీయాలని ఒకేసారి మార్చలేకపోవచ్చు. మనము రోజూ పేపర్లు చదువుతాము, టివిలు చూస్తాము. మనకి కనీసం అర్థం అవుతుంది, ఎవరు అవకాశవాదో, ఎవరు అసలు రాజకీయనాయకుడొ.. అదే విషయాన్ని కనీసం కొంతమందితోనైనా మాట్లాడుదాము. అందరికి రాజకీయలంటే చీదరే.. కాని ఇంకా ఎన్ని రోజులు ఇలా.. ఎందుకు మనము చదువుకున్నది.. మైకు పట్టుకుని మాట్లాడనవసరం లేదు.. మీ చుట్టాలతో లేక మీ స్నెహితులతో రాజకీయాలు మాట్లాడండి లేక మీకు అనిపించింది బ్లాగు వ్రాయండి.
2004 ఎన్నికలప్పుడు కొంతమంది నాయకుల మాటలు, ఇప్పుడు అంటున్న మాటలు కొన్ని..
| 2004 ఎన్నికలు | ప్రస్తుతం | |
![]() |
చంద్రబాబు ప్రపంచ బ్యాంక్ జీతగాడు. మన రాష్ట్రాన్ని అమెరికా కు తాకట్టు పెట్టాడు. మతతత్వ శక్తులతో చేతులు కలిపి ఈ దేశాన్ని నాశనం చేస్తున్నాడు. కరెంటు చార్జీలు తగ్గించమంటె నలుగురు ప్రాణాలు బలిగొన్నాడు. తెలుగుదేశాన్ని తరిమికొట్టండి. పెట్టుబడి దారుల కొమ్ము కాస్తున్న ఈ పాలన ఇంక ఎంతో కాలం కొనసాగదు. చంద్రబాబుని గద్దె దించడానికే మా పార్టి కాంగ్రెస్ తో ఎన్నికల అవగాహన కుదుర్చుకుంది. మా పార్టి సిద్దాంతాలకు అనుగుణంగా మేము నడుచుకుంటాము. మా జాతీయ నాయకత్వము తీసుకున్న నిర్ణయాలకు అణుగుణంగా మేము కాంగ్రెస్ పార్టితో కలిసి పనిచేస్తున్నాము. | కాంగ్రెస్ దుష్టపాలన అంతంచేయడమే మా మహాకూటమి లక్ష్యం. ఎక్కడచూసినా అవినీతి, ధరల పెరుగుదల, ఇందిరమ్మలో అవినీతి, ఒక్క సెంటు భూమి కూడా అసలైన పేదవారికి ఇవ్వలేదు. చంద్రబాబు ఇప్పుడు మారారు. మతతత్వశక్తులకు దూరంగా వున్నారు. మా జాతీయస్థాయిలో పొత్తులను బట్టి ఇక్కడా మేము అదే వైఖరిని పాటిస్తాము. |
![]() |
మాకు సోనియాగాంది మీద పూర్తి నమ్మకం వుంది. తెలంగాణ వెనుకుబాటుతనం గురుంచి మేడం సొనియాగాంది గారికి పూర్తిగా వివరించాము. కాంగ్రెస్ అధిష్టానం మీద వంద శాతం నమ్మకం వుంది. అందుకే మా పార్టి ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టితో పొత్తుకుదుర్చుకున్నది. తెలంగాణ గత 5 సంత్సరాలలో పూర్తిగా వెనుకబడింది. ఈ తెలుగుదేశం ప్రభుత్వం తెలంగాణా ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించింది. తెలంగాణ నుంచి చంద్రబాబుని తరిమికొట్టండి. తెలంగాణ ఆకలి దెబ్బకి చంద్రబాబు దిమ్మతిరగాలి. | తెలంగాణకి ఏకైక అడ్డం కాంగ్రెస్ పార్టి. తెలంగాణ ప్రజలని ఈ రాజశేఖరరెడ్డి మోసం చేసారు. కబడ్దార్ కాంగ్రెస్..ఇక మీ ఆటలు సాగవు. గత 5 సంత్సరాలుగా తెలంగాణలో కొత్తగా ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఈ సారి మా తడాఖ చూపిస్తాము. తెలంగాణలొ కాంగ్రెస్ పార్టికి బొంద పెడతాము. తెలంగాణలో మళ్ళా ఒక్క కాంగ్రెస్ నాయకుడుకూడా తిరగలేడు. కాంగ్రెస్ సీనియర్లు అంతా దద్దమ్మలు, ఎందుకు పనికిరాని వాళ్ళు. తెలుగుదేశంతో మేము పని చేయడానికి తెలంగాణ మేధావులు, కళాకారులు మరియు ప్రజా సంఘాల వాళ్ళ మద్దతు కూడా వుంది. |
![]() |
మా నినాదం సమైక్యాంద్ర. నేను చంద్రశేఖరరావు గారికి అప్పుడు మంత్రి పదవి ఇచ్చివుంటే ఇప్పుడు ఇలా వుండేదికాదు. ఆయనకి చిత్తశుద్దివుంటే ఎప్పుడొ బయటకు వెళ్ళేవారు. మా పాలనలో తెలంగాణ అభివ్రుద్ది ఆంద్ర ప్రాంతంతో సరిసమానంగా జరిగింది. ఇవ్వాళ ఎవరో కొంతమంది తమ స్వప్రయోజనాలకోసం తెలంగాణ అని గోలచేస్తున్నారు. వామపక్షాలకి ఒక సిద్దాంతంలేదు. వారికి వున్న రెండు శాతం వోట్లు మమ్ముల్ని ఏమిచేయలేవు. అయినా బిజెపి ని మతతత్వ పార్టి అనడం ఏంతవరకు సబబు. వాజపేయి గారి నాయకత్వంలో ఈదేశం ఎంతో అభివ్రుద్ది సాదించింది. | కాంగ్రెస్ అరాచకాలకు తగిన బుద్ది చెపుతాము. తెలంగాణ సాధించడం మహా కూటమికే సాధ్యం. వామపక్షాలు, టిరెస్, మేము కలవడంతో కాంగ్రెస్ కు వణుకు పుడుతుంది. మేము కచ్చితంగా 200కు పైగా సీట్లు సాధిస్తాము. చిరంజీవి అసలు మాకు పోటీ కాదు. మేము జతీయ స్థాయిలో కూడా వామపక్షాలకు మద్దతుఇస్తాము. |
![]() |
కేంద్రంలో వాజపేయి ప్రభుత్వము, రాష్ట్రంలో చంద్రబాబు చేసిన అభివ్రుద్ది మమ్ముల్ని ఈ ఎన్నికల్లో గెలిపిస్తాయి. ఇవ్వళ మన రాష్ట్రంలో ఐటి ఇంతగా అభివ్రుద్ది అయిందంటే దానికి కారణం చంద్రబాబే. గత 5 సంత్సరాల్లో జరిగిన అభివ్రుద్ది ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు. బిజెపి, తెలుగుదేశం మరలా ప్రభుత్వాలు కచ్చితంగా ఏర్పాటు చేస్తాయి. | చంద్రబాబు వలనే మేము తెలంగాణ ఇవ్వలేకపోయాము. వాజపేయి ప్రధానిగా వున్నపుడు మేము ఎన్నొసార్లు తెలంగాణ ప్రస్తావన చేసిన చంద్రబాబు అడ్డుపడ్డారు. తెలంగాణ కేవలం జాతీయ పార్టీలకే సాధ్యం. మేము ఈసారి పదవికి వచ్చిన 100 రోజుల్లొ తెలంగాణ ఇస్తాము. చంద్రబాబు పెద్ద దొంగ..అవకాశవాది. ఈసారి మేము ఒంటరిగానైనా పోటి చేయడానికి సిద్దంగా వున్నాము. |
![]() |
టిరెస్ మాతో కలవడం ఎంతో సంతోషదాయకం. ఇక తెలంగాణ సాధించడం ఎంతో దూరం లేదు. తెలంగాణకి ప్రధమ శత్రువు చంద్రబాబేనని కెసిర్ తెలుసుకోవడం అభినందనీయం. సోనియా గాంధిగారు కూడ తెలంగాణకి అనుకూలంగానే వున్నారు. మేము ఈ సారి ఎన్నికల్లో పూర్తి మెజారిటి సాధిస్తాము. తెలుగుదేశానికి డిపాజిట్లుకూడా దక్కవు. వామపక్షాలు మాతో కలవడం మాకు మరింత బలం. మేము వామపక్షాలు కలిసి కరెంట్ ఉద్యమము చేసాము. | టిరెస్ వలనే తెలంగాణ ఆలస్యం అయింది. వాళ్ళకి ఒక పద్దతి లేదు, తెలంగాణ వాళ్ళ సొంత సొత్తు అనుకుంటున్నారు. రాఘవులు గారికి సీట్లే ముఖ్యము. వామపక్షాలకి వున్న రెండు శాతం వోట్లు మమ్ముల్ని ఏమిచేయలేవు. వాళ్ళది పిచ్చికూటమి. మా ప్రభుత్వము చేసిన అభివ్రుద్ది మమ్ముల్ని గెలిపిస్తుంది. మాకు ఏకూటములు అవసరంలేదు. |
జనవరి 15, 2009
గోడ మీద పిల్లి ఆఫ్ ది ఇయర్ 2008
గుడ్ ఈవినింగ్, మీరు చూస్తున్నది టివి91, నా పేరు రాజు. ముందుగా మీ అందరికి 2008 గుర్తులు కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమములో ముందుగా మనము చూడబోయే అంశం ‘గోడమీద పిల్లి ఆఫ్ ది ఇయర్ 2008′. ఇక ఆలస్యం చేయకుండా కార్యక్రమము మొదలు పెడదామా…
“నేను చిరంజీవి గారు రాజకీయాల్లోకి రావాలని పాదయాత్ర చేస్తే నాకు కనీసం గౌరవం కూడా ఇవ్వలేదు, అందుకే నేను వేరే పార్టిలో చేరదాము అనుకుంటున్నాను. అసలు చిరంజీవి వల్ల సామాజిక న్యాయం సాధ్యపడదు” అని ఈమద్య ఒక రిటైర్డ్ ఐఏస్ అధికారి రొశయ్య అన్న మాటలివి. “కాంగ్రెస్ పార్టి ఆఫీసులో ఎక్కడ చూసినా కిళ్ళీలు వుమ్మి, ఏమూల చూసినా దుమ్ము కనిపిస్తాయి. అదే తెలుగుదేశం ఆఫిసులో చాలా శుబ్రంగా వుంటుంది. మొన్న రైలు ప్రమాదం జరిగినప్పుడు నేను నారాయణ కాలేజి డైరెక్టర్, ఏసి బోగిలో వున్నాము. నేను ప్రమాదం జరిగిన వెంటనే నారాయణ డైరెక్టర్ నుంచి సెల్ ఫోను తీసుకోని రాజశేఖరరెడ్డి గారికి ఫోను చేసి చెపితే ఆయన, ఆ అవునా అంటూ ఫోను పెట్టేసారు. అదే ముఖ్యమంత్రి చంద్రబాబుకు చేస్తే వెంటనే స్పందించారు“, ఈ మాటలు నన్నపనేని రాజకుమారి గారు తెలుగుదేశంలో చేరేటప్పుడు ఇచ్చిన వివరణ. పచ్చి కాంగ్రెస్ వ్యతిరేకి, తన వాక్చాతుర్యంతో కాంగ్రెస్ విధానాలను ఎండకట్టీన బహుముఖ ప్రఘ్నాశాలి జైపాల్ రెడ్డీ గారు కాంగ్రెస్ లో చేరుతూ “ఇప్పుడు కాంగ్రెస్ అవసరం ఎంతైనా వుంది” అంటూ కాంగ్రెస్ లో చేరారు. ఇలా చెప్పుకుంటూపోతే ఒక పెద్ద పుస్తకం నిడిపోతుంది. ఒక రైలు దిగి ఇంకో రైలు ఎక్కినట్లు రాజకీయ నాయకులు ఒక పార్టి నుంచి మరొక పార్టికి మారుతున్నారు. 2004 అసెంబ్లి ఎన్నికలప్పుడు దానం నాగేందర్ గోడమీద పిల్లికి అసలైన అర్థం ఏమిటొ మనకు చూపారు. ఆసిఫ్ నగర్ అసెంబ్లి టికెట్ ఇవ్వలేదని ఒక్క అంగలో తెలుగుదేశంలో చేరారు. బాగా చదువుకున్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమి ఆలోచించకుండా నాగేందర్ కు టికెట్ ఇచ్చారు. నాగేందర్ ఎన్నికల్లో గెలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. తరువాత మరలా మన నాగేందర్ గారు కాంగ్రెస్ లో చేరడము, రాజీనామా చేయడమూ, మరలా ఎలక్షన్లు అన్ని మామూలే. ఇవ్వాళ మరలా గ్రేటర్ హైదరాబాదు అద్యక్షునిగా నాగేందర్ ని చదువుకున్న డి శ్రీనివాస్ గారు నియమించారు. ఇవన్ని చూస్తుంటే అందరూ పార్టిలు మారేది తమ స్వప్రయోజనాలకే అని తెలుస్తుంది. ఇదిఏమి కొత్త విషయమేమి కాదు. కాని ఇన్ని జరుగుతున్నా జనంలో ఒక్కరైనా వాళ్ళని అడిగిన వాళ్ళులేరు. అంతా చదువుకున్న వాళ్ళమే, కాని మనమెవరము పార్టిలు మారే వాళ్ళని ప్రశ్నించము. వరదనీరులాగా ప్రజా రాజ్యంలోకి గోడమీద పిల్లులు చేరుతుంటే , దాని గురించి ఆలోచించడానికి చిరంజీవి గారికి సమయము దొరకడంలేదు. క్యాడర్ పెరుగుతుంది అని ఆలోచిస్తూ అందరికి ప్రజారాజ్యం కండువా వేస్తున్నారు. కాని వీళ్ళంతా సిద్దాంతాలను పాటించకుండా, తమ సొంత ప్రయోజనాలకోసమో, వేరే పార్టిలో వారికి గౌరవం దక్కడంలేదనో ప్రజా రాజ్యంలో చేరుతున్నారని చిరంజీవిగారు ఆలోచించాలి. ఆదికేశవులునాయుడు గారు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలో చేరి, మరలా కాంగ్రెస్ కి సపోర్ట్ ఇచ్చి ఇవ్వాళ టిటిడి చైర్మన్ గా వున్నారు. తెలుగుదేశం తరుపున రాజ్యసభకి ఎన్నికై, రామారావు గారు చనిపోయినతరువాత లక్ష్మి పార్వతికి సపొర్ట్ ఇచ్చి, తరువాత బిజెపి తరుపున ప్రచారం చేసి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు చుట్టం అయ్యారు విలక్షన మోహనబాబు గారు. సూపర్ స్టార్ క్రిష్ణ గారు ఎందుకు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి మారారో, మరలా ఇప్పుడు కాంగ్రెస్ లోకి ఎందుకు మారారో ఎవరికి తెలియదు.
ఇక్కడ మనము గమనించాల్సిన విషయమేమిటంటే పార్టిలు తమ సిద్దంతాలని ఏమి మార్చడంలేదు, కాని గోడమీద పిల్లులకు వారి అవసరాలే ముఖ్యం. ఇక అసలు విషయానికి వద్దాము. మన అసెంబ్లికి 2009లో ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఇక గోడమీద పిల్లులు తమ ప్రతాపం చూపిస్తాయి. 2008 వ సంవత్సరంలో చాలా మంది పార్టిలు మారారు. వీళ్ళందరిలో “గోడమీద పిల్లి ఆఫ్ ది ఇయర్ 2008″ సెలెక్ట్ చెయ్యడం కోసం టివి9 కాంటెస్ట్ పెట్టింది. అయితే ఇందులో కొంతమందిని మాత్రమే పరిగణించవలసి వచ్చింది. బాగా పేరున్న నాయకులు, పదవులు అనుభవించి వేరే పార్టిలో చేరిన వాళ్ళూ, పార్టి మారడంతోనే పదవి వచ్చిన వాళ్ళనే కాంటెస్ట్ లోకి తీసుకోవడం జరిగింది. ఇందులో పార్టి నుంచి బయటకు వెళ్ళీ సొంత పార్టి పెట్టుకున్న వాళ్ళని పరిగణలోకి తీసుకోలేదు. కాంటెస్ట్ కు ఎంపిక అయినవాళ్ళు
|
పేరు |
ఏ పార్టి నుంచి? |
ఏ పార్టి లోకి? |
|
హరిరామ జోగయ్య |
కాంగ్రెస్ |
ప్రజారాజ్యం |
|
ఉపేంద్ర |
కాంగ్రెస్ |
ప్రజారాజ్యం |
|
శివశంకర్ |
కాంగ్రెస్ |
ప్రజారాజ్యం |
|
వంగవీటి రాధ |
కాంగ్రెస్ |
ప్రజారాజ్యం |
|
పులిమి శైలజ |
కాంగ్రెస్ |
ప్రజారాజ్యం |
|
బషీరుద్దీన్ బాబూఖాన్ |
కాంగ్రెస్ |
ప్రజారాజ్యం |
|
కోటగిరి విధ్యాధరరావు |
తెలుగుదేశం |
ప్రజారాజ్యం |
|
తమ్మినేని సీతారాం |
తెలుగుదేశం |
ప్రజారాజ్యం |
|
భూమా నాగిరెడ్డి |
తెలుగుదేశం |
ప్రజారాజ్యం |
|
శొభానాగిరెడ్డి |
తెలుగుదేశం |
ప్రజారాజ్యం |
|
సి రామచంద్రయ్య |
తెలుగుదేశం |
ప్రజారాజ్యం |
|
పాలేటి రామారావు |
తెలుగుదేశం |
ప్రజారాజ్యం |
|
ఘంటా శ్రీనివాసరావు |
తెలుగుదేశం |
ప్రజారాజ్యం |
|
యలమంచిలి రవి |
తెలుగుదేశం |
ప్రజారాజ్యం |
|
జి గనబాబు |
తెలుగుదేశం |
ప్రజారాజ్యం |
|
ఖలీల్ భాష |
తెలుగుదేశం |
ప్రజారాజ్యం |
|
పరకాల ప్రభాకర్ |
బిజెపి |
ప్రజారాజ్యం |
|
గాలి ముద్దుక్రిష్ణమనాయుడు |
కాంగ్రెస్ |
తెలుగుదేశం |
|
పి దొరబాబు |
బిజెపి |
కాంగ్రెస్ |
|
సంతొష్ రెడ్డి |
టి.అర్.ఎస్ |
కాంగ్రెస్ |
|
కె లింగయ్య |
టి.అర్.ఎస్ |
కాంగ్రెస్ |
|
జి ముకుంద రెడ్డి |
టి.అర్.ఎస్ |
కాంగ్రెస్ |
|
బి సార రాణి |
టి.అర్.ఎస్ |
కాంగ్రెస్ |
|
ఆదికేశవులునాయుడు |
కాంగ్రెస్ |
తెలుగుదేశం |
|
పెద్ది రెడ్డి |
తెలుగుదేశం |
న.తె.పా |
|
క్రిష్ణ (సూపర్ స్టార్ ) |
తెలుగుదేశం |
కాంగ్రెస్ |
|
జూపూడి ప్రభాకర్ |
కాంగ్రెస్ |
ప్రజారాజ్యం |
|
యలమంచిలి శివాజి |
తెలుగుదేశం |
ప్రజారాజ్యం |
ఏ పార్టిలోకి ఎక్కువ దూకారు?

చూశారుగా పోటి ఎంత ఎక్కువగా వుందో, వీళ్ళందరిలో “గోడమీద పిల్లి ఆఫ్ ది ఇయర్ 2008″ ని సెలెక్ట్ చెయ్యడం కోసం టివి91 పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. ఈ కంటెస్ట్ విన్నర్ ఎవరో తెసుకునే ముందు ఒక చిన్న బ్రేకు. చూస్తూనే వుండండి నిరంతర వార్తావాహిని టివి91.
వెల్కం బ్యాక్. ఇక ఈ పొటిలో ఫైనల్ కి చేరిని ముగ్గురు ఎవరంటే.. గుట్టుచప్పుడు కాకుండా డిల్లీలో మన్మోహన్ సర్కారికి ఓటు వేసి, వెంటనే టిటిడి పదవికొట్టిన ఆదికేశవులునాయుడు, తన స్టూడియో భూములకోసం తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన సూపర్ స్టార్ క్రిష్ణ, తనతో పాటు తన భార్యని కూడా తెలుగుదేశం నుంచి ప్రజా రాజ్యంలోకి తెచ్చిన భూమా నాగిరెడ్డీ.

ఇక విన్నర్ ఎవరంటే …తనదైన శైలిలో కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలో చేరి, లోక్ సభ సభ్యునిగా 4 సంత్సరాలు పనిచేసి, ప్రధాన మంత్రికి ఆపత్భాందవుడై, ఏడుకొండలవాడి సన్నిదిలో పదవి చేపట్టీ గోడమీద పిల్లికి అసలైన అర్థం చెప్పిన ఆదికేశవులునాయుడు గారు…
టివి91 విశ్లేషణ :
2008లో బాగ నష్టపోయిన పార్టి: ప్రజారాజ్యం (ఎక్కువగా ఈ పార్టిలోకి దూకారు. మరలా దూకటానికి అనుభవం మెండుగా వుంది)
2008లో బాగ లాభపడ్డ పార్టి: తెలుగుదేశం (దూకాల్సిన వాళ్ళూ దూకారు. ఇంకా దూకుతున్నారు. చంద్రబాబు ఇప్పుడు పార్టిని బలోపేతం చేసుకోవడానికి అవకాశం వుంది)
2008లో బాగా బిస్కెట్లు వేసిన పార్టి: కాంగ్రెస్ (ఆదికేశవులునాయుడు, క్రిష్ణ, మందా జగన్నాథం లాంటి వారికి కాంగ్రెస్ లోకి రావడం వలన పదవులు లేక ఆస్తులు వరించాయి)
ముగింపు: పార్టిలు ఎక్కువ అయిపోయాయి, అవకాశాలు పెరిగాయి, పార్టి మారడమంటే కండువా మార్చడమే. పార్టి మారిన వాళ్ళని అడిగే వాళ్ళు ఎవరూ లేరు. చాలా సార్లు ఒక వ్యక్తి పార్టి మారడంవలన ప్రజల నెత్తిన ఆర్ధిక భారం పెరుగుతుంది. ఎవరి పనుల్లొ వాళ్ళు బిజి, ఎన్నికలరోజున ఓటు వేసేవాళ్ళు బాగా తగ్గిపోతున్నారు. కాని మనము ఓటు వేయకపోవడం వలన జరిగే నష్టం ఎవరూ ఆలోచించడంలేదు. అందరం చదువుకున్నాము, కాని ఎవరూ మాట్లాడరు. మీడియా కుడా పార్టిలు మారిన వాళ్ళగురుంచి ప్రచారం చేయరు.ఈ కొత్త సంవత్సరం అందరం ఒక ప్రతిఘ్న చేద్దాము. పార్టిలు మారేవాళ్ళ గురుంచి మాట్లాడుదాము, వాళ్ళకి జాగ్రత్తగా ఓటు వేద్దాము..



























